Karnataka: ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం
Karnataka: కర్నాటకకు చెందిన వారితోనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Karnataka: ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్-సీ, గ్రూప్-డీ పోస్టులను 100శాతం కర్నాటకకు చెందిన వారితోనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కన్నడిగులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కన్నడిగుల సంక్షేమమే తమ ప్రాధాన్యతని రాసుకొచ్చారు. ఈ బిల్లును గురువారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు కర్ణాటక న్యాయశాఖ వర్గాలు తెలిపాయి.