Karnataka: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం
Karnataka CM Oath Ceremony Live: సిద్దరామయ్యతో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్
Karnataka Oath Ceremony Updates: కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎనిమిది మందిలో ముగ్గురు దళిత మంత్రులు కాగా.. లింగాయత్, ఓబీసీ, ఎస్టీ, క్రిస్టియన్, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ప్రమాణం చేశారు. కొరటగెరె నియోజకవర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర మంత్రిగా ప్రమాణం చేశారు. గతంలో హోంమంత్రి, మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయనకు మరోసారి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్ప... గతంలో మూడు సార్లు మంత్రి పదవులు చేసిన సర్వగ్న నగర్ ఎమ్మెల్యే KJ జార్జ్‌కు సిద్దూ ప్రభుత్వంలో మరోసారి మంత్రి పదవి దక్కింది.
గతంలో హోంమంత్రిగా.. జలవనరుల మంత్రిగా పనిచేసిన బబలేశ్వర్ ఎమ్మెల్యే ఎంబీ పాటిల్‌కు కూడా మంత్రివర్గంలో మరోసారి అవకాశం వచ్చింది. ఈయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన గోకక్ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీశ్ జర్కిహోళి కూడా మంత్రిగా ప్రమాణం చేశారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. చిత్తాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రియాంక్ ఖర్గే గతంలో ఐటీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. గతంలో మూడు సార్లు మంత్రిగా సేవలు అందించిన మాజీ హోంమినిస్టర్ రామలింగారెడ్డి.. మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. మాజీ మంత్రి.. చామరాజ్ పేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.