Karnataka Elections: రేపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
Karnataka Elections: కర్ణాటక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
Karnataka Elections: రేపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. కర్ణాటక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. అయితే సర్వేలు మాత్రం కర్ణాటకలో హంగ్ తప్పదంటున్నాయి. సర్వేలు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. అయితే ఎగ్జిట్‌పోల్స్ కాదు.. పీపుల్‌పోల్స్‌ను నమ్ముతామని... రెండోసారి గెలుపు ఖాయమని కమలనాథులు అంటున్నారు. ఇదిలా ఉంటే అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.