ఐపీఎస్ అధికారి బ్యాగ్‌ను ఓపెన్ చేయమన్న ఎయిర్‌పోర్ట్ సెక్యూర్టీ.. తీసి చూస్తే అందరూ షాక్
Arun Bothra: ఒడిషా ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రాకు జైపూర్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురయింది.
Arun Bothra: ఒడిషా ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రాకు జైపూర్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురయింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఆయన పంచుకున్నారు. ఆయన ట్వీట్ చూసి.. నెటిజన్లు షాక్ అవుతున్నారు. సరదాగా కామెంట్లు చేస్తున్నారు. బోత్రా ట్వీట్ గంటల్లోనే 40వేల లైక్స్ వచ్చేశాయి. ట్విటర్‌లో ఆయన పోస్టు తెగ వైరల్ అవుతోంది. ఇంతకు అసలు విషయం ఏమిటో తెలిస్తే.. మీరు కూడా షాక్ అవుతారు.
అరుణ్ బోత్రా ఓ సూట్‌కేసుతో నిన్న జైపూర్ ఏయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే ఆయన సూట్‌కేసులో అనుమానాస్పదంగా ఏదో ఉందంటూ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అనుమానించింది. సూట్ కేసును ఓపెన్ చేయాలని కోరింది. అందులో ఏమున్నాయో బోత్రా చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో ఆయన తన సూట్‌కేసును తెరిచి చూపించారు. సూట్‌కేసు తెరవగానే వారికి పచ్చి బఠానీలు కనిపించాయి. దీంతో ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారులు సైలెంట్ అయ్యారు. ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేసిన సూట్ కేసు ఫొటోను అరుణ్ బోత్రా ట్వీట్ చేస్తూ విషయం చెప్పారు. బఠానీలు స్మగ్లింగ్ చేస్తే అరెస్టు చేయాల్సిందే అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ట్విటర్‌లో ఈ బోత్రా ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది.