మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.!

ISRO: ఇస్రో ప్రతిపాదనకు రూ.471 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

Update: 2022-05-13 02:13 GMT

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.! 

ISRO: ఇస్రో సరికొత్త ప్రయోగాలకు సిద్ధమైంది. విశ్వశోధనలో సుధీర్ఘ లక్ష్యాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తోంది. ఏడాదికి 15 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగాలు చేసేందుకు సన్నద్దమవుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు కరోనా అడ్డురావడంతో ఏడాదిన్నర కాలం ఆలస్యమైంది. భవిష్యత్ అసవరాల దృష్ట్యా ఇక్కడి నుంచి ఏటా 15 శాటిలైట్స్ ప్రయోగించేలా ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం శ్రీహరి కోట షార్‌లోని కొత్త ప్రయోగవేదికలో మరిన్ని వసతులు ఏర్పాటు చేసి దానిని ప్రయోగాలకు అందుబాటులోకి తెచ్చేలా రూపకల్పన చేశారు ఇస్రో సైంటిస్టులు.

భారీ లక్ష్యాన్ని నిర్ణయించుకన్న ఇస్రో తిరుపతి జిల్లాలోని షార్ లో ప్రయోగ వేదికను పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని 2018లోనే భావించారు. అందుకే ప్రతిపాదనలు పంపించగానే కేంద్రం 471కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో PSLV ఇంటి గ్రేషన్ ఫెసిలిటీ పనులు 2019లో ప్రారంభించారు.

షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానం చేస్తూ PIF ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొదటి ప్రయోగ వేదికలో వసతులు ఏర్పాటయ్యాయి. 'ఇంటిగ్రేషన్‌ ఆన్‌ప్యాడ్‌, ఇంటిగ్రేషన్‌ ట్రాన్స్‌ఫర్‌ టు ప్యాడ్‌' అనే రెండు అంశాలను మొదటి ప్రయోగ వేదికకు జోడించి పనులు చేశారు. ఉష్ణ కవచాన్ని వాహక నౌకను అనుసంధానం చేసిన అనంతరం ఎంఎస్‌టీని ప్రయోగ వేదిక నుంచి 200 మీటర్ల దూరం తీసుకెళ్తారు. ప్రయోగ వేదికపై వాహక నౌక ఉన్న సమయంలో వాతావరణంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఇబ్బంది లేకుండా ఎంఎస్‌టీ సేవలు వినియోగించే వెసులుబాటు ఉంటుంది.

పీఐఎఫ్‌ భవనం ఎత్తు 15 అంతస్తులుగా ఉంటుంది. దాని ఎత్తు 66 మీటర్లు, వెడల్పు 35 మీటర్లు, పొడవు 35 మీటర్లు ఉంటుంది. రాకెట్‌ అనుసంధానం కోసం పది స్థిర ప్లాట్‌ఫారాల ఏర్పాటు చేశారు. భవనం నుంచి ప్రయోగ వేదిక వరకు 1.5 కి.మీ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. 

Full View


Tags:    

Similar News