Infosys Sudha Murthy: 600 మంది అబ్బాయిలు.. మధ్యలో ఒక్కతే అమ్మాయి.. సుధామూర్తి విద్యాభ్యాసం సాగిన తీరు..

* ఇంజనీరింగ్ చదవాలనుకున్నప్పుడు తండ్రి తిరస్కరణ..అయినా ఎదిరించి ఇంజనీరింగ్ చదివేందుకే నిర్ణయించుకున్నాను. కాలేజీలో 600 మంది అబ్బాయిలు ఒక్కతే అమ్మాయిని..ప్రత్యేకించి లేడీస్ టాయిలెట్ లేదు..ప్రిన్సిపల్ పెట్టిన కండిషన్లు..

Update: 2023-05-16 16:00 GMT

Infosys Sudha Murthy: 600 మంది అబ్బాయిలు.. మధ్యలో ఒక్కతే అమ్మాయి.. సుధామూర్తి విద్యాభ్యాసం సాగిన తీరు..

Infosys Sudha Murthy: ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి భార్య, ప్రముఖ రచయిత్రి, సామాజికవేత్త సుధామూర్తి తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాలీవుడ్ టాక్ షో ది కపిల్ శర్మ షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుధామూర్తి తన వైవాహిక, వ్యక్తిగత విషయాలను షేర్ చేశారు. నారాయణ మూర్తి పేరు పక్కన పలు దేశాల పేర్లు ఉండడంతో ఆయన్ను అంతర్జాతీయ బస్ కండక్టర్ అని అనుకున్నానని అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, నారాయణమూర్తిని తొలిసారి కలిసినప్పుడు ఎవరీ చిన్నపిల్లాడని అనుకున్నానని చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా తన విద్యాభ్యాసం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను సుధామూర్తి ప్రేక్షకులతో పంచుకున్నారు.

సుధామూర్తి 1968లో ఇంజనీరింగ్ కళాశాలలో చేరారు. నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు. కర్ణాటకలోని హుబ్లీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీతో తాను చేరానని..599 మంది మగ విద్యార్థులు ఉన్న ఆ కాలేజీలో తాను ఒక్కదాన్నే మహిళా స్టూడెంట్నని చెప్పారు. తనకు సీటు ఇచ్చే ముందు ప్రిన్సిపల్ పలు కండిషన్లు పెట్టారని గుర్తు చేసుకున్నారు. కాలేజీకి చీరకట్టుకొని రావాలని, కాలేజీ క్యాంటీన్ కు వెళ్లకూడదని, మగ విద్యార్థులతో మాట్లాడకూడదని షరతులు పెట్టారని చెప్పారు. కాలేజీకి ప్రతి రోజు చీరలోనే వెళ్లేదానినని, కాలేజీ క్యాంటీన్ అంతగా బాగుండదు కాబట్టి అటుగా వెళ్లేదాన్ని కాదన్నారు.

ఇక కాలేజీలో చేరిన తర్వాత తనతో మాట్లాడేందుకు మగపిల్లలే భయపడేవారని చెప్పారు. కానీ తన ప్రతిభను చూసి వాళ్లే తన వద్దకు వచ్చి మాట్లాడేవారని నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. కాలేజీతో ఒక్క అమ్మాయినే కాబట్టి..కొంతకాలానికి టీసీ తీసుకొని వెళ్లిపోతానని ప్రిన్సిపల్ అనుకున్నారని..కానీ తాను పట్టుదలతో కోర్సును కంప్లీట్ చేశానని చెప్పుకొచ్చారు. అంతేకాదు, కాలేజీలో అందరూ పురుషులే కావడంతో ప్రత్యేకించి లేడీస్ టాయిలెట్ ఉండేది కాదని గుర్తు చేసుకున్నారు. మొత్తంగా, సుధామూర్తి మాటలు ఎంతో ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు మరెంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. 

Tags:    

Similar News