Apoorva Mukhija: ఇన్‌ఫ్లూయెన్సర్ అపూర్వాపై దాడి.. సంచలన పోస్టు పెట్టిన యూట్యూబర్!
Apoorva Mukhija: ఇన్‌ఫ్లూయెన్సర్ అపూర్వా ముఖిజా ఇప్పుడు తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టింది.

Apoorva Mukhija: ఇన్‌ఫ్లూయెన్సర్ అపూర్వాపై దాడి.. సంచలన పోస్టు పెట్టిన యూట్యూబర్!
Apoorva Mukhija: ఇన్‌ఫ్లూయెన్సర్ అపూర్వా ముఖిజా ఇప్పుడు తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టింది. అయితే ఈసారి ఆమె చేసిన పోస్ట్ సామాన్యమైనదేం కాదు. గతంలో 'ఇండియాస్ గాట్ లేటెంట్' షోకి సంబంధించిన వివాదం తర్వాత సోషల్ మీడియా నుంచి పూర్తి విరామం తీసుకున్న అపూర్వా, ఇప్పుడు తనపై వచ్చిన తీవ్ర విమర్శలు, బెదిరింపులను బహిరంగంగా బయటపెట్టింది. ఆమె షేర్ చేసిన పోస్టులో రేప్, యాసిడ్ దాడి లాగా అనేక బెదిరింపులు, ఛీ కొట్టే కామెంట్లను చూపిస్తూ... అది కేవలం ఒక్క శాతం మాత్రమే అని తెలిపింది.
సామాజిక మాధ్యమాల్లో 'ద రెబెల్ కిడ్'గా పేరుగాంచిన అపూర్వా ముఖిజా, యూట్యూబ్ షోలో జడ్జ్‌గా పాల్గొన్న తర్వాత పెద్ద సంఖ్యలో విమర్శల పాలు అయ్యింది. ముఖ్యంగా సమయ్ రైనా రూపొందించిన 'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో భాగంగా జరిగిన ఒక సెగ్మెంట్ తీవ్ర స్థాయిలో వివాదానికి దారితీసింది.
ఈ షోలో రణవీర్ అల్లాబాదియా ఒక పోటీదారుడిని ఉద్దేశించి ప్రశ్నించిన ప్రశ్నే వివాదానికి దారితీసింది. ఆయన అడిగిన అసభ్యమైన ప్రశ్నపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దీనికి అనుబంధంగా షోలో ఉన్న ఇతర సభ్యులపై కూడా విమర్శలు వచ్చాయి. వారిలో అపూర్వా ముఖిజా, రణవీర్ అల్లాబాదియా, ఆశిష్ చంచలానీ ఉన్నారు. అప్పటి నుంచి అపూర్వా తన సోషల్ మీడియా ఖాతాను పూర్తిగా ఎంప్టీ చేసి, అందరినీ అన్ఫాలో చేశారు.
అయితే ఇప్పుడు ఆమె మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన పోస్ట్ ద్వారా తన బాధను, తాను ఎదుర్కొన్న ఆన్‌లైన్ దాడులను బహిరంగంగా చెప్పింది. అంతే కాదు, మరో పోస్ట్‌లో కథ చెప్పే వ్యక్తి దగ్గరే కథ ఉండాలి అని తన భావాన్ని తెలిపారు. ఇది ఆమె మనోభావానికి అద్దం పడుతుంది.
ఇక షో వివాదం తర్వాత తొలి సారిగా రణవీర్ అల్లాబాదియా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. తన కుటుంబం, డాగ్, టీమ్‌తో ఉన్న ఫోటోల్ని షేర్ చేశారు. అపూర్వా గతంలో 'హూస్ యువర్ గైనాక్?' అనే టీవీ సిరీస్‌లో నటించగా, ఇటీవల ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్‌తో కలిసి 'నదానియాన్'లో కనిపించారు. అయితే ఇప్పుడు ఆమె చేసిన ఆత్మవిశ్వాసంతో కూడిన రీ ఎంట్రీ ఆమెపై వచ్చిన విమర్శలకు తనదైన సమాధానమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే ఆమె అర్థవంతమైన కంటెంట్‌తో తిరిగి వస్తుందని ఆశిస్తున్నారు.