PM Modi: 2025 నాటికి టీబీని నిర్మూలించాలన్నది భారత్‌ లక్ష్యం

PM Modi: గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది టీబీ రోగులను దత్తత తీసుకుంటాం.

Update: 2023-06-18 14:21 GMT

PM Modi: 2025 నాటికి టీబీని నిర్మూలించాలన్నది భారత్‌ లక్ష్యం

PM Modi: ప్రధాని మోడీ 102వ మన్‌కీబాత్ కార్యక్రమం నిర్వహించారు. దేశప్రజలతో మమేకం కావాలనే టార్గెట్‌తో మొదలుపెట్టిన ఈ కార్యక్రమంతో ప్రధాని మోడీ పలు విషయాలపై ముచ్చటించారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో జరిగే అంశాలపై కూడా ప్రధాని మోడీ టచ్ చేసారు. వివిధ రంగాల్లో మనవవారు సాధించిన ఘన విజయాలతోపాటు అనేక విషయాలను ప్రధాని మోడీ ప్రజలతో షేర్ చేసుకున్నారు. మట్టి సారవంతంగా లేకుంటే ఆ ప్రాంతాన్ని పచ్చగా మార్చేందుకు జపాన్ సాంకేతికత, మియావాకీ చాలా మంచి మార్గమని మోడీ తెలిపారు.

ఈ టెక్నిక్ నెమ్మదిగా భారతదేశంలో కూడా కనిపిస్తుందిన్నారు. భారతదేశం 2025 నాటికి టీబీని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టిబీకి వ్యతిరేకంగా ఈ ఉద్యమంలో ని-క్షయ్ మిత్రులు బాధ్యతలు చేపట్టారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది టీబీ రోగులను దత్తత తీసుకుంటున్నారని తెలిపారు.

Tags:    

Similar News