ప్రయనికులను ఆకట్టుకుంటున్న ఇండియన్ రైల్వేస్ విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్
ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించడానికి రైల్వేశాఖ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా భారతీయ రైల్వేశాఖ ప్రవేశపెట్టిన విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన స్పీడ్ ట్రయల్ కూడా సక్సెస్ అయ్యింది. రైల్వే బోగీలోని ఫెసిలిటీస్‌ను చూసి రైల్వే ప్రయాణికులు ఫుల్ ఫిదా అవుతున్నారు. ఈ బోగీలో ఎప్పుడెప్పుడు జర్నీ చేయాలా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
విస్టాడోమ్ కోచ్ ను గంటకు సుమారు 180 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా డిజైన్ చేశారు. ఇలాంటి కోచ్‌ల్లో ప్రయాణం ప్యాసింజర్స్‌కి ఓ మరుపురాని జ్ఞాపకంగా మిగిలుతుందని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తన ట్వీట్‌లో పోస్ట్ చేశారు. టూరిజం అభివృద్ధికి కూడా విస్టాడోమ్ కోచ్‌లు సహకరించనున్నట్లు ఆయన తెలిపారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాకటరీ ఈ కోచ్‌ను రూపొందించింది. అయితే ఈ కోచ్‌లకు చెందిన స్క్వీజ్ టెస్ట్‌ను ఇటీవలే పూర్తి చేశారు.
విస్టాడోమ్ కోచ్ డిజైన్ అద్భుతంగా ఉంది. ఇందులో గ్లాస్ విండోలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. గ్లాస్ రూఫ్‌తో పాటు అబ్జర్వేషన్ లాంజ్, రూట్ టేబుల్ సీట్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు తాము వెళ్లే రూట్‌కు సంబంధించిన లొకేషన్లను ఈ కోచ్‌ల ద్వారా తిలకించే వెసలుబాటు కల్పించారు. ఒక్కొక్క విస్టాడోమ్ కోచ్‌లో 44 సీట్లు ఉంటాయి. ప్రతి సీటు 180 డిగ్రీలు తిరిగే విధంగా ఏర్పాటు చేశారు
ప్రయాణికులకు జర్నీ బోరు కొట్టకుండా ఈ కోచ్‌లో వైఫై సేవలను కూడా ఏర్పాటు చేశారు. ఆధారిత ప్యాసింజెర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఉంటుంది. కోచ్‌లో ఉన్న గ్లాస్ షీట్లను లామినేట్ చేశారు. కేవలం ప్రకృతి అందాలను తిలకించే ప్రదేశాల్లో మాత్రమే ఈ కొత్త డిజైన్ విస్టాడోమ్ కోచ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
విస్టాడోమ్ కొత్త డిజైన్ కోచ్‌లను వినియోగించే రూట్లను కూడా రైల్వే శాఖ ప్రకటించింది. దాదర్-మడగావ్, అరకు లోయ, కశ్మీర్ లోయ, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, కల్కా షిమ్లా రైల్వే, కంగ్రా వ్యాలీ రైల్వే, మాథేరన్ హిల్ రైల్వే, నీలగిరి మౌంటేన్ రైల్వే ప్రాంతాల్లో విస్టాడోమ్ కోచ్‌లను నడపనున్నారు.