Indian Railways: సెప్టెంబరు 30 వరకు అన్ని రైళ్లు రద్దు.. రైల్వే శాఖ నిర్ణయం..

Indian Railways: కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ పొడగించారు.

Update: 2020-08-11 04:09 GMT
Indian Railways

Indian Railways: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చ్ నెలలో ప్రదాని మోడీ దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం రైలు ప్రయనలపై భారత రైల్వే మంత్రిత్వ శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు సాధారణ రైళ్ల, ప్రయాణీకులు బుక్ చేసిన టిక్కెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు రద్దు చేస్తున్నట్టు అన్ని జోనల్ రైల్వేలకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, వచ్చే నెలాఖరు వరకు రద్దు చేస్తున్నామని భారతీయ రైల్వే ట్విట్టర్‌లో వెల్లడించింది.

తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు ఐఆర్‌సీటీసీలో ఎలాంటి బుకింగ్స్, అడ్వాన్స్ రిజర్వేషన్స్ ఉండవని రైల్వే క్లారిటీ ఇచ్చింది. అటు సెప్టెంబర్ 30వ తేదీ వ‌ర‌కు టికెట్లు బుక్ చేసుకున్న‌వారికి డ‌బ్బులు వాప‌స్ చేస్తామ‌ని రైల్వే అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర రైళ్ల సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

 

Tags:    

Similar News