Indian Railways in Transportation: రవాణాలో భారత రైల్వే సూపర్

Indian Railways in Transportation: కరోనా సవాళ్లను దాటుతూ మిషన్ మోడ్ లో పని చేస్తూ గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ సరుకులను రవాణా

Update: 2020-07-28 14:35 GMT
Indian Railways

Indian Railways in Transportation: కరోనా సవాళ్లను దాటుతూ మిషన్ మోడ్ లో పని చేస్తూ గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ సరుకులను రవాణా చేసి భారత రైల్వే శాఖ గణనీయమైన మైలురాయిని సాధించింది. సరిగ్గా ఇదే తేదీకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ సరుకులను భారత్ రైల్వేశాఖ రవాణా చేసింది. అంటే 27 జూలై 2020 నాటికి 3.13 మెట్రిక్ టన్నులు సరుకు రవాణా చేసింది. 27 జూలై 2020 న సరుకు రవాణా రైళ్ల సగటు వేగం 46.16 కిలోమీటర్లు, అదే తేదీకి (22.52 కిలోమీటర్లు) గత సంవత్సరంతో పోలిస్తే ఇది రెట్టింపు అని భారత రైల్వేశాఖ తెలిపింది. జూలై నెలలో సరుకు రవాణా రైళ్ల సగటు వేగం 45.03 కిలోమీటర్లుగా నమోదయింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు (23.22 కిలోమీటర్లు) అని తెలిపింది.

పశ్చిమ మధ్య రైల్వే 54.23 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా, ఈశాన్య సరిహద్దు రైల్వే 51 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసింది. తూర్పు సెంట్రల్ రైల్వే 50.24 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగా, ఈస్ట్ కాస్ట్ రైల్వే 41.78 కిలోమీటర్లు. అదే విధంగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 42.83 కిలోమీటర్లు, సౌత్ ఈస్టర్న్ రైల్వే 43.24 కిలోమీటర్లు, వెస్ట్రన్ రైల్వే భారతీయ రైల్వేలో సరుకు రవాణా రైలు సగటు వేగంతో 44.4 కిలోమీటర్ల వేగంగా నమోదయింది. దాంతో 27 జూలై 2020 న మొత్తం భారతీయ రైల్వేలో 1039సరుకుతో నిండిన రేక్స్ లలో 76 రేక్స్ ఫుడ్ గ్రెయిన్, 67 రేక్స్ ఎరువులు, 49 రేక్స్ స్టీల్, 113 రేక్స్ సిమెంట్, 113 రేక్స్ ఇనుము ధాతువులు, 363 రేక్ బొగ్గు ఉన్నాయి. దీంతో భారత రైల్వే దాదాపు 200 మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసిందని తెలిపింది. ఇక పోతే గణనీయంగా సరుకు రవాణా, రైల్వేల ఆదాయాలు మొత్తం దేశానికి పోటీ లాజిస్టిక్‌లకు దారి తీస్తుందని తెలిపింది. రైల్వే సరుకు రవాణాను భారతీయ రైల్వేలో కూడా అనేక రాయితీలు / తగ్గింపులు ఇవ్వడం విశేషం. 

Tags:    

Similar News