చైనాపై మరో డిజిటల్ స్ట్రైక్.. డిజిటల్ రుణాలు..

డేటా మరియు గోప్యతా ఉల్లంఘనల విషయంలో ప్రభుత్వం ఈ సంస్థలపై దర్యాప్తు చేయబోతోంది. మీడియా నివేదికల ప్రకారం, సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో కంటే ఫిన్‌టెక్..

Update: 2020-09-23 03:04 GMT

చైనాపై మరో డిజిటల్ స్ట్రైక్ చేయడానికి భారత్ సిద్ధమైంది. భారతదేశంలో వ్యాపారం చేస్తున్న చైనా ఫిన్‌టెక్ కంపెనీలను ప్రభుత్వం త్వరలో నిషేధించే అవకాశం ఉంది. డేటా మరియు గోప్యతా ఉల్లంఘనల విషయంలో ప్రభుత్వం ఈ సంస్థలపై దర్యాప్తు చేయబోతోంది. మీడియా నివేదికల ప్రకారం, సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో కంటే ఫిన్‌టెక్ యాప్ లలో డేటాను పంచుకోవడం చాలా ప్రమాదకరం. ఈ యాప్ లలో వినియోగదారులు తమ ఆధార్ కార్డు సంఖ్య, ఆదాయపు పన్ను వివరాలు వంటి సమాచారాన్ని పంచుకుంటారు. దీనివలన వ్యక్తుల సమాచారం లీక్ అవుతుందనే అనుమానం చాలారోజులుగా ఉంది.. దీంతో కేంద్ర ప్రభుత్వం వీటిని నిషేధించాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఈ ఫిన్‌టెక్ కంపెనీల ప్రధాన వ్యాపారం డిజిటల్ రుణాలు. భారతదేశంలో, దాని లావాదేవీల విలువ 2019 లో 110 బిలియన్ డాలర్లు (రూ .8.09 లక్షల కోట్లు), ఇది 2023 నాటికి 350 బిలియన్ డాలర్లకు (రూ. 25.75 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా. అయితే, ఇది మొబైల్ వినియోగదారుల సంఖ్యపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇదిలావుంటే లఢక్ సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత్-చైనా మధ్య వాణిజ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. జూన్‌లో తూర్పు లడఖ్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. ఆ తరువాత ప్రభుత్వం చైనా ఆర్థిక రంగంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా 224 చైనీస్ యాప్‌లను నిషేధించడం తోపాటు ఇతర ఆర్థిక కార్యకలాపాలను దెబ్బతీసింది భారత్. 

Tags:    

Similar News