చరిత్రలో తొలిసారిగా : యుద్ధ నౌకల్లో మహిళా అధికారుల నియామకం

భారత నావికాదళ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులను యుద్ధనౌకల్లో అధికారులుగా నియమించారు. వాయుమార్గాన అబ్జర్వర్ మరియు..

Update: 2020-09-21 12:00 GMT

భారత నావికాదళ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులను యుద్ధనౌకల్లో అధికారులుగా నియమించారు. వాయుమార్గాన అబ్జర్వర్ మరియు వ్యూహకర్తలుగా సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి, మరో సబ్ లెఫ్టినెంట్ రీతి సింగ్ లను ఎంపిక చేశారు. వీరు ఇకనుంచి యుద్ధ నౌకలో వద్ద మోహరించనున్నారు. నౌకాదళం​ అమ్ములపొదిలో చేరనున్న అత్యాధునిక ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాఫ్టర్లలో వీరు విధులు నిర్వహిస్తారని సమాచారం. ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాఫ్టర్లు శత్రు దేశాల నౌకలు, సబ్‌మెరైన్లను గుర్తిస్తాయి. దక్షిణ నావికాదళ కమాండ్ యొక్క వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ గరుడలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ ఇద్దరు మహిళా అధికారులు తమ నేవీ అబ్జర్వర్ కోర్సును పూర్తిచేసుకున్నారు .

కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లుగా ఉన్న ఈ ఇద్దరు మహిళలు 2018 లో నేవీలోకి నియమితులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన సబ్ లెఫ్టినెంట్ రీతి సింగ్ తాత ఆర్మీలో పనిచేసారు, ఆమె తండ్రి మాజీ నావికాదళ అధికారి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నేవీలో చేరడం తన జీవితాశయం అన్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తన కల నిజమైందని ఆమె చెప్పారు. ఇక ఘజియాబాద్‌కు చెందిన సబ్ లెఫ్టినెంట్ త్యాగి మాట్లాడుతూ, తనకు చాలా సంతోషంగా ఉందని.. 2015 లో నావికాదళ విమానంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు అర్పించిన లెఫ్టినెంట్ కిరణ్ షేఖావత్ అనే మహిళా అధికారి గురించి వచ్చిన వార్తలే తనను నేవీలో చేరడానికి ప్రేరేపించాయని చెప్పారు. 

Tags:    

Similar News