Omicron Test: ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు కొత్త పరికరం..రూపొందించిన ఐసీఎంఆర్
Omicron Test: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌ను ముందుగానే గుర్తించేందుకు ఐసీఎమ్ఆర్ సరికొత్త కిట్‌ను రూపొందించింది.
Omicron Test: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌ను ముందుగానే గుర్తించేందుకు ఐసీఎమ్ఆర్ సరికొత్త కిట్‌ను రూపొందించింది. ఈ కిట్‌ను కమర్సియల్ గా ఉపయోగించుకునేందుకు కిట్లను సొంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు కావాల్సిన సాంకేతికతను బదిలీ చేసేందుకు IVD కిట్ తయారీదారుల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం ఆహ్వానించింది. ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు కావాల్సిన RTPCR, కిట్‌ను డిబ్రుగఢ్‌లోని ఐసీఎమ్ఆర్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది.
దీనిపై పేటెంట్ హక్కులు, కమర్సియల్ హక్కులు తమకే ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. అగ్రిమెంట్ కుదుర్చున్న వారికి కిట్‌ను తయారు చేసి, అమ్ముకునే అధికారాన్ని ఇస్తామని తెలిపింది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కిట్లు లేవు. అనుమానిత రోగుల నుంచి నమూనాలను సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. దీంతో ఫలితాలు తేలేందుకు ఆలస్యమవుతోంది. ఈ సమయంలో ఐసీఎమ్ఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమంటున్నారు నిపుణులు.