IMD: మరో ఐదు రోజుల్లో కేరళకు నైరుతి.. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం

IMD: రాబోయే ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2024-05-28 04:30 GMT

IMD: మరో ఐదు రోజుల్లో కేరళకు నైరుతి.. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం

IMD: రాబోయే ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్యలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు నైరుతి విస్తరించే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు పశ్చిమబెంగాల్‌- బంగ్లాదేశ్‌ మధ్యలో తీరం దాటిన తీవ్ర తుపాను ‘రెమాల్‌’ సోమవారం ఉదయానికి తుపానుగా బలహీనపడింది. దీంతో రుతుపవనాల ఆగమనానికి సానుకూలతలు ఏర్పడ్డాయి.

మరోవైపు రాబోయే 5 రోజుల్లో దేశవ్యాప్తంగా నెలవారీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరుగుతాయని అంచనా వేస్తోంది. ఇటు ఏపీలో రెమాల్ తుఫాన్ తీరం దాటడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశముందని వివరించింది.

Tags:    

Similar News