Chennai: చెన్నైని ముంచెత్తిన వరదలు.. చెరువులా మారిన రోడ్లు

Chennai: రోడ్లపై పడవల్లో ప్రయాణం.. జలదిగ్బంధంలో కాలనీలు

Update: 2023-12-06 08:43 GMT

Chennai: చెన్నైని ముంచెత్తిన వరదలు.. చెరువులా మారిన రోడ్లు

Chennai: మిచౌంగ్ తుపాను తమిళనాడును కుదిపేసింది. ముఖ్యంగా చెన్నై నగరం అతలాకుతలమైంది. వర్షాలు తగ్గు ముఖం పట్టినా కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.రోడ్లన్నీ చెరువులా మారాయి. రోడ్లపై పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.

వరదల బీభత్సంతో తీర ప్రాంత ప్రజలు ఇంకా భయం గుప్పిట్లో ఉన్నారు. ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. సురక్షిత ప్రాంతాలకు బాధితులను తరలించారు. అన్ని ప్రాంతాలకు సహాయక చర్యలు అందక బాధితులు ఆందోళన చెందుతున్నారు.

వర్షం తగ్గినా... చెన్నైలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు.

మరో వైపు వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో మృతులు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటతించింది.

Tags:    

Similar News