GSLV MK-III ప్రయోగం విజయవంతం

GSLV MK-III: గగనతలంలోకి దూసుకెళ్లిన భారత్ "బాహుబలి"

Update: 2022-10-23 01:46 GMT

GSLV MK-III ప్రయోగం విజయవంతం

GSLV MK-III: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. శాస్త్రవేత్తల కృషి ఫలించింది. వినువీధుల్లో విజయకాంతులు విరజిమ్ముతూ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రోదసిలోకి దూసుకెళ్లింది. కనీవినీ ఎరుగని విధంగా ఒకే సారి 36 బ్రాడ్ బ్యాండ్ ఉపగ్రహాలను తీసుకెళ్లింది. 5200 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనకేంద్ర డైరెక్టర్ రాజారాజన్ ప్రకటించారు. ఉపగ్రహ ప్రయోగం విజయవంతంకావడంతో సహచర శాస్త్రవేత్తలతో ఆనందం పంచుకున్నారు. ఆత్మీయ ఆలింగనంతో పరస్పర శుభాకాంక్షలు తెలిజేసుకున్నారు.

Full View
Tags:    

Similar News