Delhi: మన వ్యాక్సిన్ల కు పెరుగుతోన్న డిమాండ్ - ప్రధాని
Delhi : కరోనా కట్టడికి ఇండియా తయారు చేస్తున్న వ్యాక్సిన్లకు డిమాండ్ పెరుగుతోందని ప్రధాని మోదీ తెలిపారు.
Delhi: కరోనా కట్టడికి ఇండియా తయారు చేస్తున్న వ్యాక్సిన్లకు డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ కు తగినట్లు గా మనం వ్యాక్సిన్లను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి తరహాలో భవిష్యత్‌లో పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో చేపట్టిన చర్యల అమలుపై ప్రధాని మోదీ మంగళవారం ఓ వెబినార్‌లో మాట్లాడారు. కరోనా అనంతరం ఆరోగ్య రంగంలో మన సామర్థ్యం పట్ల ప్రపంచానికి విశ్వాసం కలిగిందన్నారు.
ప్రస్తుతం ఆరోగ్య రంగానికి అసాధారణంగా బడ్జెట్ కేటాయింపులుండటం ఈ రంగం పట్ల మన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో కొవిడ్ - 19 వంటి పలుసవాళ్లను ఎదుర్కొనేలా కరోనా వైరస్ మనకు ఓ గుణపాఠం నేర్పిందని చెప్పారు. వైద్య పరికరాల నుంచి మందుల వరకూ, వెంటిలేటర్ల నుంచి వ్యాక్సిన్ల వరకూ..శాస్త్రీయపరిశోధనల నుంచి ఆరోగ్య మౌలిక సదుపాయాల వరకూ భారత్ భవిష్యత్‌లో ఎలాంటి ఆరోగ్య ఎమర్జెన్సీనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని అన్నారు.