Probe Against Rajiv Gandhi Foundation: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ పై విచారణకు హోమ్ శాఖ ఆదేశం
Probe Against Rajiv Gandhi Foundation: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అండ్ ఛారిటబుల్ మరియు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లపై విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
Probe Against Rajiv Gandhi Foundation: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అండ్ ఛారిటబుల్ మరియు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లపై విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీని కోసం హోం మంత్రిత్వ శాఖ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దర్యాప్తుకు ఈడీ ప్రత్యేక డైరెక్టర్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీ.. గాంధీ కుటుంబానికి చెందిన ఈ రెండు ట్రస్టులు.. నిబంధనలను ఉల్లంఘించాయో లేదో నిర్ధారించనుంది. కొద్ది రోజుల కిందట రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా రాయబార కార్యాలయం నుండి విరాళాలు అందినట్లు బిజెపి ఆరోపించింది. అంతేకాదు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ మరియు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్టులు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఆదాయపు పన్ను నిబంధనలను ఉల్లంఘించినట్లు బీజేపీ ఆరోపిస్తోంది.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా నుంచి పెద్దఎత్తున విరాళాలు అందుకుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆరోపించారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టడమే కాకుండా చైనాతో సరిహద్దు వివాదం సమస్య నుండి దృష్టిని మళ్ళించడానికి బిజెపి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఎదురుదాడి చేసింది. కాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ను 21 జూన్ 1991 న సోనియా గాంధీ ప్రారంభించారు. విద్య, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, నిరుపేదలు, వికలాంగుల సాధికారత కోసం ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది. ఇది కేవలం విరాళాల ద్వారానే నడుస్తుంది. దీనికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దీనికి చైర్‌పర్సన్ గా ఉంటే.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పి. చిదంబరం ధర్మకర్తలుగా ఉన్నారు.