పీఎం కిసాన్ కింద ఈ తప్పు చేశారా.. డబ్బు తిరిగి చెల్లించాల్సిందే..!

PM Kisan: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో అనేక కొత్త పథకాలని ప్రారంభిస్తోంది.

Update: 2022-02-18 10:41 GMT

పీఎం కిసాన్ కింద ఈ తప్పు చేశారా.. డబ్బు తిరిగి చెల్లించాల్సిందే..!

PM Kisan: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో అనేక కొత్త పథకాలని ప్రారంభిస్తోంది. క‌రోనా వైర‌స్ స‌మ‌యంలో ప్రజ‌ల‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గ‌ట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయ‌త్నిస్తోంది. అయితే చాలాసార్లు వీటికి అర్హత లేని వ్యక్తులు కూడా ఈ పథకాల ప్రయోజనాన్ని పొందుతున్నారు. అలాంటి నకిలీ లబ్ధిదారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మీరు కూడా ఈ తప్పు చేసి ఉంటే వెంటేనే ఈ విషయం తెలుసుకోండి.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 10వ విడత విడుదలైంది. PM కిసాన్ పథకం 24 ఫిబ్రవరి 2019న ప్రారంభించబడినప్పుడు దాని ప్రయోజనం 2 హెక్టార్ల వరకు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే అని చెప్పారు. తరువాత ఈ పథకం 1 జూన్ 2019న సవరించారు. ఇది వారి హోల్డింగ్‌ల పరిమాణంతో సంబంధం లేకుండా అన్ని రైతు కుటుంబాలకు విస్తరించారు. అంటే ఇప్పుడు ఎన్ని హెక్టార్ల భూమి ఉన్న రైతైనా సరే ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పొలం రైతు పేరు మీదనే ఉండాలని గుర్తుంచుకోండి.

PM కిసాన్ పథకం కింద ఇప్పుడు ఎవరి పేరు మీద పొలం ఉందో ఆ రైతు కుటుంబాలకు మాత్రమే సహాయం అందుతుంది. పూర్వీకుల భూమిలో భాగస్వామ్యం పొందిన వారికి పిఎం కిసాన్ ప్రయోజనం ఉండదు. అయితే పాత లబ్ధిదారులకు ఈ నిబంధన వర్తించదు. వ్యవసాయ భూమి గ్రామంలో లేదా నగరంలో ఉన్నా PM కిసాన్ కింద ఆర్థిక సహాయం ఉంటుంది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మార్గదర్శకం ప్రకారం ఒకే సాగు భూమిలో అనేక మంది రైతు కుటుంబాల పేర్లు ఉంటే వారందరికి రూ.6000 ప్రత్యేక ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకం కింద ఒక రైతు వ్యవసాయం చేస్తే ఆ పొలం అతని పేరు మీద కాకుండా అతని తండ్రి లేదా తాత పేరు మీద ఉంటే అతనికి ఈ పథకం ప్రయోజనం ఉండదు. ఒక రైతు మరో రైతు నుంచి భూమిని తీసుకొని కౌలుకు వ్యవసాయం చేస్తే ఆ కౌలుపై సాగు చేస్తున్న వ్యక్తికి కూడా పథకం ప్రయోజనం ఉండదు.

Tags:    

Similar News