Gas Cylinder: సామాన్యులకు ఒకటో తారీఖు షాక్..పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

Gas Cylinder: నేడు నవంబర్ ఒకటో తారీఖు. గ్యాస్ సిలిండర్ ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Update: 2024-11-01 04:43 GMT

Gas Cylinder: దీపావళి పండగ పూట గ్యాస్ వినియోగదారులకు కీలక అలర్ట్. పండగలు వరుసగా రావడంతో గ్యాస్ సిలిండర్ ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నవంబర్ ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచి చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి.

దీపావళి పండగ సందర్భంగా 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 61 నుంచి 62 పెంచి వినియోగదారులకు భారతీయ గ్యాస్ పరషరా సంస్థలు పెద్ద ఫాక్ ఇచ్చాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్ పై రూ. 62 భారాన్ని పెంచాయి. కొత్త ధరలు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. వచ్చేనెల వరకు ఇవే ధరలు కొనసాగుతాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరల సవరణ ప్రతినెలా 1వ తేదీన జరగుతుంది.

ఈ మధ్య కాలంలో వరుసగా మూడు నెలల్లో సిలిండర్ ధర పెరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి అదే జరిగింది. దీంతో వరుసగా నాలుగు నెలలపాటు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. తాజాగా డిమాండ్ ధ్రుష్టిలో పెట్టుకుని 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 62 పెంచాయి. దీంతో ఒక్కో సిలిండర్ ధర రూ. 180కు చేరుకుంది. ఈ నెల నుంచే పెళ్లిళ్ల సీజన్ షురూ అవుతున్న నేపథ్యంలో ఈ ధరలు పెరగడం నిజంగా సామాన్యుడి నెత్తిన భారమే అని చెప్పుకోవాలి.

దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ ధరలు దేశరాజధాని ఢిల్లీలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 1740 నుంచి రూ. 1802కు పెరిగింది. కోల్ కతాలో రూ. 1850 నుంచి 1911కు చేరుకుంది. అయితే బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. అటు డొమెస్టి్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 818.50గా కొనసాగుతోంది. ప్రతినెలా ఒకటో తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షించి కొత్త ధరలను ప్రకటిస్తుంటాయి.


Tags:    

Similar News