Kitty Kumaramangalam: కేంద్ర మాజీ మంత్రి కుమారమంగళం సతీమణి దారుణ హత్య

Kitty Kumaramangalam: ఢిల్లీలోని ఆమె ఇంట్లో మంగళవారం రాత్రి కుట్టి కుమారమంగళం దారుణ హత్యకు గురయ్యారు.

Update: 2021-07-07 04:06 GMT

PR Kumaramangalam's Wife Kitty Murdered at Delhi 

Kitty Kumaramangalam: కేంద్ర మాజీ మంత్రి దివంగత పీఆర్ కుమారమంగళం భార్య దారుణ హత్యకు గురయ్యారు. ఢిల్లీలోని ఆమె ఇంట్లో మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. మాజీ మంత్రి భార్య కిట్టి కుమారమంగళం (67) దక్షిణ ఢిల్లీలోని వసంతవిహార్ ప్రాంత ఇంట్లో శవమై బుధవారం ఉదయం కనిపించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో దిండుతో ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.

కిట్టి హత్య కేసులో ఇప్పటివరకూ ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అరెస్టు చేసిన నిందితుడిని 24 ఏళ్ల రాజుగా గుర్తించారు. రాజు కిట్టి కుమారమంగళం ఇంట్లో దుస్తులు ఉతికే పని చేసేవాడని తెలిపారు. రాత్రి మరో ఇద్దరితో ఇంట్లోకి ప్రవేశించి కిట్టీ కుమారమంగళంపై దాడి చేసి దిండుతో ఊపిరాడకుండా హత్యచేసినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో రెండు సూట్ కేసులు తెరిచి ఉన్నాయి. కిట్టీ కుమారమంగళం హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

దివంగత కిట్టి కుమారమంగళం పీ.వీ. నరసింహారావు ప్రభుత్వం, వాజ్ పేయి ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించారు. మొదట ఆయన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. అనంతరం 1984లో మొదటిసారి సేలం లోక్ సభ నియోజకవర్గానికి ఎన్నికయ్యారు. 1991-92 మధ్య కుమారమంగళం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, చట్టం, న్యాయ శాఖ మంత్రిగా, 1992-93 లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా, 1998లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు.

Tags:    

Similar News