Team India Victory Parade : టీమిండియా విక్టరీ పరేడ్‎లో అభిమానులకు గాయాలు..ఆసుపత్రిలో చికిత్స

Team India Victory Parade : రోహిత్ సేనకు ముంబైలో ఘనస్వాగతం లభించింది. ముంబై ఎయిర్ పోర్టులో భారత జట్టుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.ఈ పరేడ్ లో కొంతమంది అభిమానులకు తీవ్రగాయాలయ్యాయి.

Update: 2024-07-05 01:12 GMT

Team India Victory Parade : టీమిండియా విక్టరీ పరేడ్‎లో అభిమానులకు గాయాలు..ఆసుపత్రిలో చికిత్స

Team India Victory Parade : టీమిండియా విక్టరీ పరేడ్‎లో అభిమానులకు గాయాలు..ఆసుపత్రిలో చికిత్స

టీమిండియా విజయం అనంతరం ముంబైలో విజయోత్సవ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముంబై వీధుల్లోకి లక్షలాది మంది క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో నియంత్రించడం కష్టంగా మారింది. విక్టరీ పరేడ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో జనం రావడంతో పలువురు క్రికెట్ అభిమానులకు గాయాలయ్యాయి. స్వల్ప తొక్కిసలాట జరగడంతో పలువురు అభిమానులకు గాయపడ్డారు. వారిని పోలీసులు ఎలాగోలా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందించారు. మరికొంత మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా భారత క్రికెటర్లు ప్రయాణించిన విజయ్ రథ్ ఒకానొక సమయంలో జనాల్లో చిక్కుకుపోయింది. ఆ స్థాయిలో అభిమానులు వచ్చారు. పోలీసులు సిబ్బంది గుంపును చెదరగొట్టి బస్సును మెరైన్ డ్రైవ్ కు చేరుకునేవిధంగా చేశారు. ఎయిర్ పోర్టు నుంచి మొదలు మెరైన్ డ్రైవ్, వాంఖడే స్టేడియం వరకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. లక్షలాది మందితో ముంబై తీరం జనసంద్రంగా మారిపోవడంతో టీవీల్లో చూసేవారు సైతం ఆ జనాన్ని చూసి నోరెళ్లబెట్టారు.

పొట్టి ప్రపంచకప్ వీరులను చూసేందుకు ఫ్యాన్స్ తరలిరావడంతో సాయంత్రం 5గంటలకు ప్రారంభం కావాల్సిన వియోజత్సవ ర్యాలి రాత్రి 7.40నిమిషాలకు మొదలైంది. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్సులో ఊరేగుతూ ఫ్యాన్స్ తో కలిసి విజయాన్ని జరుపుకున్నారు. ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు గౌరవంగా నిర్వహిస్తున్న విజయోత్సవ పరేడ్ లో పాల్గొనాలని అభిమానులకు బీసీసీఐ కార్యదర్శి జైషా పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో విక్టరీ పరేడ్ లో క్రికెట్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లను సన్మానించే కార్యక్రమానికి ఫ్రీ ఎంట్రీ ఉండటంతో భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు. 



Tags:    

Similar News