Jammu Kashmir Polls: జమ్మూకశ్మీర్‌లో రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

Jammu Kashmir Polls: 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్

Update: 2024-09-24 15:30 GMT

Jammu Kashmir Polls: జమ్మూకశ్మీర్‌లో రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

Jammu Kashmir Polls: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, బీజేపీ జమ్మూకశ్మీర్‌ చీఫ్ రవీందర్ రైనా సహా పలువురు కీలక నేతలు ఎన్నికల బరిలో ఉన్నారు. పోలింగ్ దృష్ట్యా రాజౌరీ సహా పలు చోట్ల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొత్తం 3502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. వాటిలో 1,056 పోలింగ్ కేంద్రాలు పట్టణాల్లో, 2,446 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు జిల్లా అధికారి తెలిపారు.

శారు. శ్రీనగర్ జిల్లాలో పోలింగ్ జరగనున్న 8 అసెంబ్లీ స్థానాల్లో 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుద్గాం జిల్లాలోని ఐదు స్థానాల్లో 46 మంది, రాజౌరి జిల్లాలోని ఐదు స్థానాల్లో 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పూంచ్ జిల్లాలో మూడు స్థానాలకు 25మంది అభ్యర్థులు, గందర్ బల్ జిల్లాలో రెండు స్థానాలకు 21 మంది, రియాసి జిల్లాలో మూడు స్థానాలకు 20 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

రెండో విడత పోలింగ్ దృష్ట్యా రాజౌరీ సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికలు జరగనున్న 6 జిల్లాల సరిహద్దుల్లో నిఘా పెంచారు. రెండో విడత పోలింగ్ లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్ముకశ్మీర్ చీఫ్ రవిందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

Tags:    

Similar News