ఇళ్లపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే వారికి ఈ ప్రభుత్వ స్కీం సూపర్..?
ఇళ్లపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే వారికి ఈ ప్రభుత్వ స్కీం సూపర్..?
Solar Plant: రోజు రోజుకి విద్యుత్ బిల్లులు పెరుగుతున్నాయి. సామాన్యలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్యాయ మార్గాల కోసం వెతుకుతున్నారు. అలాంటి వారికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. అంతేకాదు ప్రభుత్వం కూడా ఇళ్లపై సోలార్ ఏర్పాటుకి తగిన సహకారం అందిస్తుంది. అందుకోసం రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ అనే స్కీంని ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీరు సులభంగా సోలర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల గురించి తెలుసుకుందాం.
రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఒక వ్యక్తి ఇప్పుడు జాతీయ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుడు సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేసే బ్యాంకు ఖాతా వివరాలతో పాటు అవసరమైన సమాచారాన్ని తెలియజేయాలి. దరఖాస్తు సమయంలో లబ్ధిదారునికి మొత్తం ప్రక్రియ, సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేయగల సబ్సిడీ మొత్తం గురించి చెబుతారు. సోలార్ ప్లాంట్ కోసం అప్లై చేసిన దరఖాస్తు 15 రోజులలో సంబంధిత డిస్కామ్‌కు ఆన్‌లైన్‌లో ఫార్వార్డ్ అవుతుంది. సాంకేతిక ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారుడు తనకు నచ్చిన ఏదైనా విక్రయదారుడి నుంచి సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.
అయితే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నియమ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. DCR షరతులకు అనుగుణంగా ఉండే సోలార్ మాడ్యూల్‌లను ఎంచుకోవాలి. వాటిని ALMM, J3IS సర్టిఫైడ్ ఇన్వర్టర్‌ల కింద నమోదు చేసుకోవాలి. విక్రేత రాబోయే 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ప్లాంట్‌ను నిర్వహించాలి. లబ్ధిదారుడు తన ప్లాంట్‌ను నిర్ణీత వ్యవధిలో ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే దరఖాస్తు రద్దు చేస్తారు.