గౌవహతి నుంచి ముంబై బయలుదేరిన ఏక్ నాథ్ షిండే

Eknath Shinde: ఏక్ నాథ్ షిండే వ్యూహంపై ఉత్కంఠ

Update: 2022-06-24 08:23 GMT

గౌవహతి నుంచి ముంబై బయలుదేరిన ఏక్ నాథ్ షిండే 

Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని రెబల్ ఎమ్మెల్యేలు.. గౌవహతి నుంచి ముంబై బయలుదేరారు. రెబల్స్ టీమ్ ముంబైలో డిప్యూటీ స్పీకర్ ను కలిసే అవకాశం ఉంది. అసరమైతే, రెబల్ ఎమ్మెల్యేలతో షిండే పరేడ్ నిర్వహించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఏక్ నాథ్ షిండే వ్యూహంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

కాసేపట్లో మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జర్వాలే అసెంబ్లీకి చేరుకోనున్నారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ సెక్రటరీకి శివసేన బృందం లేఖ రాసింది. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్ కు లేఖరాసిన శివసేన.. తాజాగా మరో నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరింది. దీంతో డిప్యూటీ స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

గత రెండు రోజుల నుంచి అసోంలోని గౌహతిలో మకాం వేసిన రెబెల్ ఎమ్మెల్యేలు, కొద్దిసేపటి క్రితం గౌహతి ఎయిర్ పోర్టు నుంచి ముంబైకి బయలుదేరారు. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత తిరుగుబావుటా ఎగురవేసిన శివసేన ఎమ్మెల్యేలు.. గుజరాత్ లోని సూరత్ లో క్యాంపు ఏర్పాటు చేశారు. అనూహ్యంగా తర్వాతి రోజున అసోంలోని గౌవహతికి మకాం మార్చారు. గోటానగర్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో రెండు రోజులకుపైగా క్యాంప్ పాలిటిక్స్ నిర్వహించారు షిండే. అనర్హత వేటు అంశాన్ని శివసేన తెరపైకి తేవడంతో అలెర్ట్ అయిన రెబల్స్ టీమ్ ముంబైకి బయలుదేరారు.

శివసేన ఎల్పీ ఛాంబర్ లో పార్టీ లీగల్ సెల్, ఎంపీల సమావేశం కొనసాగుతోంది. తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.గోటానగర్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో తిరుగుబాటు ఎమ్మెల్యేల మకాం.

Tags:    

Similar News