Delhi Liquor Policy Scam: మద్యం కేసులో కేజ్రీవాల్ ‘కింగ్‌పిన్’.. కోర్టుకు వెల్లడించిన ఈడీ..
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు ఈడీ అధికారులు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది ఈడీ. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కింగ్‌పిన్‌గా అభివర్ణించారు ఈడీ అధికారులు. మద్యం పాలసీని సౌత్ గ్రూప్‌నకు అనుకూలంగా చేసి కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారని ఈడీ తెలిపింది.
రెండు సందర్భాల్లో నగదు బదిలీ జరిగినట్లు గుర్తించామని కోర్టుకు తెలిపింది ఈడీ. ఈ కేసులో విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు కోర్టుకు స్పష్టం చేసింది. లిక్కర్ పాలసీ కోసం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్సీ కవితతో సీఎం కేజ్రీవాల్ చెప్పారని ఈడీ కోర్టుకు తెలిపింది. 45 కోట్ల రూపాయలు హవాలా మార్గం ద్వారా గోవా తరలించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఈడీ అధికారులు ఆరోపించారు.