Election Commission: అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలకు ఈసీ నోటీసులు

Election Commission: సుప్రియాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఎన్సీడబ్ల్యూ

Update: 2024-03-27 12:34 GMT

Election Commission: అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలకు ఈసీ నోటీసులు

Election Commission: అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు నేతలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతే.. కంగనా రనౌత్ మాడర్న్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా... పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు కంగనా రనౌత్‌కు బీజేపీ అవకాశం ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథే సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. కంగనా ఓ వేశ్య అంటూ మాడర్న్ ఫొటోను షేర్ చేసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్సీడబ్ల్యూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు దీదీ ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడి కుమార్తెను అంటూ ప్రచారం చేసుకుంటుందని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదం అయ్యాయి. దాంతో ఇద్దరు నేతలకు ఈసీ నోటీసులు ఇచ్చింది.

Tags:    

Similar News