Droupadi Murmu: సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తన ప్రత్యేకత చాటుకున్నారు
Droupadi Murmu: ప్రజల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు
Droupadi Murmu: ప్రజల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని అన్నారు రాష్ట్రపతి ముర్ము. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకమని చెప్పారు. భారత చలనచిత్ర ఉన్నతిలో ఎన్టీఆర్ పాత్ర కీలకమన్న ముర్ము.. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తన ప్రత్యేకత చాటుకున్నారన్నారు. సామాజిక న్యాయం కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమం జరిగింది.
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా 100 రూపాయల స్మారక నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ ఎంపీలు హాజరయ్యారు.