కరోనా ఎఫెక్ట్ : తండ్రిని కలుసుకోలేని బిడ్డ.. చూస్తే కనీళ్లు ఆగవు..

కరోనావైరస్ వ్యాప్తిపై పోరాడటానికి మనమందరం ఇంట్లో ఉంటున్నాము, వైద్యులు వారి కుటుంబాలకు దూరంగా ఉండి పేషంట్లకు వైద్యం అందిస్తున్నారు .

Update: 2020-04-15 10:40 GMT

కరోనావైరస్ వ్యాప్తిపై పోరాడటానికి మనమందరం ఇంట్లో ఉంటున్నాము, వైద్యులు వారి కుటుంబాలకు దూరంగా ఉండి పేషంట్లకు వైద్యం అందిస్తున్నారు .ఈ సూపర్ హీరోలు ఇతరులను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. ఈ ప్రక్రియలో తమ ప్రియమైనవారితో గడిపే సమయాన్ని కూడా త్యాగం చేస్తున్నారు. తాజాగా ఒక సంఘటన గుండెకు హత్తుకునేలా చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్న పాప.. తన తండ్రి ప్రేమను పొందటానికి ఆరాటపడుతుంది.

కరోనా పేషంట్లకు చికిత్స చేసి ఇంటి దగ్గరకు వచ్చిన తండ్రి.. ఇంట్లోకి రాకుండా తన కూతురిని గ్లాస్ తలుపునుంచే చూస్తాడు.. ఈ క్రమంలో ఆ పాప తండ్రిని కలుసుకోవడం కోసం తలుపును తీయమని కోరుతుంది.. కానీ తలుపు ఎంతకీ తెరుచుకోకపోవడంతో ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది. ఆ తండ్రి కూడా చేసేదేమి లేక అద్దం మీద తడుముతూ వెళ్ళిపోతాడు.. ఒకవేళ అతను డోర్ తీసి బిడ్డను దగ్గరకు తీసుకొని ఉంటే ఏమి జరిగేదో అందరికి తెలిసిందే. అలా అని అతను కరోనా పేషంట్ అంటే కాదు.. కానీ ఆ పేషంట్లకు వైద్యం చేసి వచ్చిన వారు కాబట్టి జాగ్రత్తలో ఉండాలి. ఏది ఏమైనా ఇలాంటి వీడియోలు చూసైనా ప్రజలు ఇళ్లలోనుంచి బయటికి రాకుండా ఉండాలని కోరుకుందాం.


Tags:    

Similar News