పోలీస్ అధికారి వేరే మహిళతో ఉండగా 'రెడ్ హ్యాండెడ్' గా పట్టుకున్న భార్య
సాక్షాత్తు ఆయన పోలీస్ శాఖలో డీజీ ర్యాంకు అధికారి. ప్రజలను కాపాడాల్సిన ఆయన భయబ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించారు. తన భార్యను విషాక్షణారహితంగా కొట్టి..
సాక్షాత్తు ఆయన పోలీస్ శాఖలో డీజీ ర్యాంకు అధికారి. ప్రజలను కాపాడాల్సిన ఆయన భయబ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించారు. తన భార్యను విషాక్షణారహితంగా కొట్టి హింసించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ పోలీసులలో డిజి ర్యాంక్ అధికారి అయిన పురుషోత్తం శర్మ, ప్రియ శర్మ దంపతులు.. వారికి ఒక కుమారుడు ఉన్నారు. వీరంతా భోపాల్లో నివసిస్తున్నారు. అయితే పురుషోత్తం శర్మ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ క్రమంలో పురుషోత్తం శర్మ వేరే మహిళతో ఉండగా భార్య ప్రియ శర్మ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో ఆగ్రహం చెంది వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించింది. భార్యపై కోపం పెంచుకున్న పురుషోత్తం.. ఆమెపై తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. అది కూడా వారి సొంత ఇంట్లో పనిచేసే ఉద్యోగుల ముందు.. ఈ సంఘటనను స్వయంగా పురుషోత్తం శర్మ కుమారుడు పార్థ గౌతమ్ వీడియో తీశాడు.
అనంతరం సోషల్ మీడియాలో పోసి చేశాడు. ఈ వీడియో ఫుటేజీని మధ్యప్రదేశ్ హోంమంత్రి, రాష్ట్ర డిజిపి, ప్రధాన కార్యదర్శి , ఇతర ఉన్నతాధికారులకు కూడా పంపారు. పార్థ గౌతమ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ లో ఉన్నారు. తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భార్యను కొట్టిన సంఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు పురుషోత్తంను పదవి నుండి తొలగించారు. ఈ విషయం రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి వచ్చింది. దీనిపై ఛైర్మన్ శోభా ఓజా మాట్లాడుతూ.. ఈ విషయంపై సదరు డిజికి నోటీసు ఇస్తామన్నారు.. మాట్లాడటానికి తాము ప్రయత్నించినప్పుడు స్పందించలేదని ఆమె అన్నారు.