మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

* మెట్లబావి పైకప్పు కూలడంతో కదిలిన యంత్రాంగం

Update: 2023-04-03 08:52 GMT

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో అక్రమ కట్టడాలపై మున్సిపల్‌ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. శ్రీరామనవమి రోజున ఇండోర్‌ ఆలయంలో చోటుచేసుకున్న విషాదకర ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. గతంలోనే చర్యలు తీసుకున్నట్లయితే నవమి రోజు విషాదాన్ని నివారించగలిగేవారని దర్యాప్తులో తేలింది. ఐదు బుల్డోజర్లతో బాలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి చేరుకున్న మున్సిపల్, పోలీస్ అధికారులు, అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు.

Tags:    

Similar News