Delta Plus Variant: భారత్‌లో డెల్టా ప్లస్ వేరియంట్ టెన్షన్
Delta Plus Variant: కొత్త వేవ్‌కు దారితీస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్ * భారత్ సహా 9 దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్
Delta Plus Variant: సెకండ్‌వేవ్ కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌ను డెల్టా ప్లస్ వేరియంట్ టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకూ బ్రిటన్ తదితర దేశాలను వణికించిన డెల్టా ప్లస్ వేరియంట్ ప్రకంపనలు భారత్‌లోనూ మొదయ్యాయి. దీంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.
బ్రిటన్‌లో కలవరం రేపుతున్న డెల్టా ప్లస్ భారత్‌లోకి ఎంటరైంది. మొత్తం నాలుగు రాష్ట్రాల్లో 30 డెల్టాప్లస్ కేసులు నమోదయినట్లు భారత ప్రభుత్వం చెబుతోంది. డెల్టా వేరియంట్ కంటే దీని వ్యాప్తి రెట్టింపు ఉండొచ్చునని... రోగ నిరోధక శక్తిని సైతం ఇది తట్టుకోగలదేమోనని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తుండటంతో థర్డ్ వేవ్ ముప్పు దీని రూపంలోనే పొంచి ఉందా అన్న చర్చ జరుగుతోంది.
మరోవైపు.. భారత్‌లోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో దాదాపు 30 డెల్టాప్లస్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దీనిని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని భారతీయ సార్స్ కోవ్-2 జినోమిక్స్ కన్సార్టియం నివేదించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ డెల్టాప్లస్ వేరియంట్ అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలాండ్, నేపాల్, చైనా, రష్యాలలో కనిపించింది.