Arun Ramachandran Pillai: ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బెయిల్
Arun Ramachandran Pillai: బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
Arun Ramachandran Pillai: ఢిల్లీ లిక్కర్ కేసులో వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం పాలసీ కేసులో అరుణ్ పిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతేడాది మార్చిలో అరెస్టు చేసింది. ఇండోస్పిరిట్ లిక్కర్ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రు నుంచి పిళ్లై లంచాలు స్వీకరించి, ఇతర నిందితులకు అందించాడని ఆయనపై ఈడీ అభియోగాలను మోపింది. ఈ కేసులో బెయిల్ కోసం రామచంద్ర పిళ్లై అనేక సార్లు.. కోర్టులను ఆశ్రయించారు.
ఐతే ఏడాదిన్నర జైలు జీవితం తర్వాత.. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. ఆయన జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది కోర్టు. నేటితో కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీవాల్‌ను తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు కేజ్రీవాల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకూ పొడిగించింది.