33కి పెరిగిన భీవండి మృతుల సంఖ్య..

మహారాష్ట్ర థానేలోని భీవండి నగరంలో సోమవారం భవనం కుప్ప కూలి మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 33 కి పెరిగిందని జాతీయ విపత్తు..

Update: 2020-09-23 03:19 GMT

మహారాష్ట్ర థానేలోని భీవండి నగరంలో సోమవారం భవనం కుప్ప కూలి మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 33 కి పెరిగిందని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) బుధవారం తెలిపింది. మృతులందరినీ థానే మునిసిపల్ కార్పొరేషన్ గుర్తించింది. మృతుదేహాలకు ఇప్పటికే పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబాలకు అప్పగించారు. ఆసుపత్రిలో మృతిచెందిన వారి వివరాలు వెల్లడించింది థానే మునిసిపల్ కార్పొరేషన్.. జుబెర్ ఖురేషి, ఫైజా ఖురేషి, ఆయేషా ఖురేషి, సిరాజ్ అబ్దుల్ షేక్, ఫాత్మా జుబెరా, సిరాజ్ అహ్మద్ షేక్ మృతిచెందినవారిలో ఉన్నారు. కాగా భీవండిలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం సెప్టెంబర్ 21 తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో కూలిపోయింది.

ఈ సంఘటన జరిగిన వెంటనే ఎన్‌డిఆర్‌ఎఫ్, థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (టిడిఆర్‌ఎఫ్), ఫైర్ బ్రిగేడ్, పోలీసు బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇదిలావుంటే భీవండిలోని ప‌టేల్ కాంపౌడ్ ప్రాంతంలో ఉన్న ఈభ‌వనాన్ని 1984లో నిర్మించిన‌ట్టు కొందరు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. ఈ బిల్డింగ్‌లో దాదాపు 21 ఫ్లాట్లు ఉన్నాయి. అంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. 

Tags:    

Similar News