Board Exams: దేశవ్యాప్తంగా అన్ని బోర్డు పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్‌

Board Exams: దేశవ్యాప్తంగా అన్ని బోర్డు పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు న్యాయవాది మమతా శర్మ.

Update: 2021-06-17 04:44 GMT

సుప్రీంకోర్టు(ఫైల్ ఇమేజ్ )

Board Exams: దేశవ్యాప్తంగా అన్ని బోర్డు పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు న్యాయవాది మమతా శర్మ. ఏపీ, కర్నాటక, కేరళ, పంజాబ్‌, అస్సాం రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్‌లో తెలిపారు. జులై, ఆగస్టు నెలల్లో పరీక్షలు నిర్వహించేందుకు కొన్ని రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయని, దీని ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళన వ్యక్తమవుతోందని స్పష్టం చేశారు.

ఏపీలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించి తీరుతామన్న మంత్రుల ప్రకటన, పంజాబ్‌, కర్నాటక, అస్సాం రాష్ట్రాలు పరీక్షల తేదీలు ప్రకటించడాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు మమతా శర్మ. సీబీఎస్‌ఈతో పాటు తమ పరిధిలో ఉన్న అన్ని బోర్డు పరీక్షలను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు రద్దు చేశాయని తెలిపారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు న్యాయవాది మమతా శర్మ.

Tags:    

Similar News