CoronaVirus Effect On ISRO: ఇస్రోపై కరోనా వైరస్ ప్రభావం

Update: 2020-07-29 09:10 GMT

CoronaVirus Effect On ISRO: భారీ ప్రణాళికలు ఒక్క ఏడాదిలో 12 ప్రయోగాలు ఖగోళ రహస్యాల చేదనలో అగ్రరాజ్యాలకు ధీటుగా కార్యాచరణ నిత్యం పరిశోధనలు పరిశీలనలతో ఈఏడాది కి 12 ప్రయోగాలకు సన్నాహాలు. ఇదీ 2020లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రూపొందించిన ప్రణాళికలు. నిత్యం వేలాదిమంది కార్మికులు వందల సంఖ్యలో శాస్త్రవేత్తలు రాకపోకలు ఎప్పుడూ హడావుడి ఇదీ మొన్నటి మార్చి 5 వరకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పరిస్థితి సీన్ కట్ చేస్తే ఇప్పుడక్కడ నిర్మానుష్యం రాజ్యమేలుతోంది శాస్త్రవేత్తల పరిశోధకులు మందగించాయి నిత్యం రద్దీగా ఉండే అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇప్పుడు మిణుకుమిణుకుమంటూ ఆకాశం వైపు చూస్తోంది ఇంతకీ షార్ ఇస్రోల పై కరోనా ఎఫెక్ట్ ఎంత..?ఈ ఏడాది ఇస్రో ప్రయోగాలకు బ్రేక్ పడినట్లేనా...?

ప్రపంచాన్ని వణికిస్తున్న మందులేని మహమ్మారి ఇటీవల షార్ పైనా పంజా విసిరింది దీంతో ఎప్పుడూ ఎన్నడూ ఊహించనంతగా షార్ కార్యక్రమాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ప్రణాళికల కార్యాచరణ అటకెక్కింది. ఖగోళ రహస్యాల చేదనలో అగ్రదేశాలకు పోటీపడుతున్న ఇస్రో ప్రయోగ కేంద్రం పై కరోనా పంజావిసిరింది. షార్ ప్రణాళికలపై కరోనా ప్రభావం ఎంత..? కొత్త ప్రయోగాల పరిస్థితి ఏంటీ..?

ఏడాదిలో ఇస్రో భారీ ప్రయోగాలకు ప్రణాళికలు రచించింది 12 మాసాల్లో12 రాకెట్‌ ప్రయోగాలు. ఇస్రో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గగన్ యాన్ కి సన్నాహాలు అందునా విశ్వవినువీధుల్లో మరేదేశానికి తీసిపోని భారీ ప్రయోగాలకు ఈ ఏడాది ఇస్రో ప్లాన్ చేసింది దానిప్రకారం జనవరి 17న ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్‌–30 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. మార్చి 5న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌2 రాకెట్‌ ద్వారా జీఐశాట్‌–1 అనే సరికొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు పూర్తి చేసిన తరువాత కొన్ని అవాంతరాలతో ఆ ప్రయోగాన్ని వాయిదా వేసుకున్నారు. మార్చి నెలాఖరులోపే రెండు పీఎస్‌ఎల్‌వీలను నింగిలోకి పంపేందుకు సిద్ధం చేశారు. మొదటి ప్రయోగవేదికలోని మొబైల్‌ సర్వీస్‌ టవర్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ49 రాకెట్‌కు సంబంధించి నాలుగు దశల రాకెట్‌ పనులు పూర్తి చేశారు. ఈ రాకెట్‌ ద్వారా కార్టోశాట్‌–3 ఉపగ్రహంతో పాటు 9 విదేశీ ఉపగ్రహాలను పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఎస్‌ఏబీ బిల్డింగ్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ50 రాకెట్‌ మూడు దశల అనుసంధానం పనులు పూర్తి చేశారు. ఈ రాకెట్‌ ద్వారా రిశాట్‌–1 అనే ఉపగ్రహాన్ని పంపేందుకు సన్నాహాలు పూర్తి చేసి కరోనాతో విరమించుకున్నారు.

అంతరిక్ష ప్రయోగాల్లో షార్ గత నాలుగు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయాణం సాగిస్తోంది 1980లో ప్రారంభమైన రాకెట్‌ ప్రయోగాల పరంపర తొలినాళ్లలో సంవత్సరానికి ఒక ప్రయోగం లేదంటే రెండు సంవత్సరాలకు ఒక ప్రయోగాన్ని చేసేవారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని 1999 నుంచి 2019 దాకా రాకెట్‌ ప్రయోగాల సంఖ్య పెరగడమే కాకుండా ఒక్క సంవత్సరం కూడా విరామం లేకుండా ప్రయోగాలు చేశారు. ప్రస్తుత ఏడాది 2020 ను ప్రత్యేక విజన్‌గా తీసుకుని 12 ప్రయోగాలు చేయాలనుకున్నారు. కరోనా వల్ల షార్ లో ఒక్క ప్రయోగం కూడా చేయలేని సంవత్సరంగా 2020 మిగిలిపోయింది. ఇస్రో ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది గగన్‌యాన్‌ ప్రయోగానికి సంబంధించి ఎక్స్‌పరమెంటల్, చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని కూడా చేయాలనుకున్నారు. 2020 ఏప్రిల్‌లోపు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–2, పీఎస్‌ఎల్‌వీ సీ49, పీఎస్‌ఎల్‌వీ సీ50 ప్రయోగాలను పూర్తి చేయాలనుకున్నారు. కానీ వీటన్నింటికి కరోనా బ్రేక్‌ వేసింది.

కరోనా వేలమంది ఉద్యోగులు శాస్త్రవేత్తలు నిపుణులపైనా షార్ లో కరోనా ప్రభావం చూపింది. దాదాపు రెండు వేల మందికి పైగా ఉద్యోగులు షార్‌ కేంద్రంలో రాకెట్‌ ప్రయోగాలకు సంబంధించి ప్రత్యక్షంగా ఇస్రోకు సంబంధించిన పనిచేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిన మరో రెండు వేలమంది పని చేస్తున్నారు. వారంతా ఉత్తర భారతదేశానికి చెందిన వలస కూలీలు. లాక్‌డౌన్‌ మెదలైన తర్వాత వారందరూ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో షార్‌లో పనులు నిలిచిపోయాయి. తాజాగా గత వారంలో షార్‌ కేంద్రంలోనూ కేసులు నమోదైన క్రమంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు.

ప్రస్తుతం సిఐ ఎస్ ఎఫ్ బృందాలు షార్ కేంద్రంలో ఉన్న రాకెట్లకు, మూడు ఉపగ్రహాలకు కాపలా కాసే పనిలో ఉన్నారు. ఇందులో కార్టోశాట్‌ ఉపగ్రహాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు శ్రీహరికోట రాకెట్‌ కేంద్రంలో ప్రయోగ వేదికలపై అనుసందానం పూర్తి చేసుకున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌2, పీఎస్‌ఎల్‌వీ సీ49, పీఎస్‌ఎల్‌వీ సీ50 అనే మూడు రాకెట్‌లను మొన్న వేరుచేస విడిభాగాలను షార్‌లోని క్లీన్‌ రూంలో ఉంచారు. ఇందులో జీఐశాట్, రిశాట్, కార్టోశాట్‌ అనే ఉపగ్రహాలను కూడా భద్రపరిచారు. వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో ఉన్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌2 రాకెట్‌ను పూర్తిగా విడదీశారు.

ఇక పీఎస్‌ఎల్‌వీ సీ50 రాకెట్‌ వాణిజ్యపరమైన ప్రయోగం కావడంతో దీన్ని ఆగస్టు 15 లోపు ప్రయోగించాలని వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌కు తరలించి అనుసంధాన ప్రక్రియ చేపట్టారు. ఈ రాకెట్‌కు సంబంధించి రెండోదశ ప్రక్రియ కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి రావాల్సి ఉండగా కరోనా ప్రభావంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దేశంలోని ఇస్రో కేంద్రాలున్న కేరళ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటకలో కరోనా వైరస్‌ విజృంభణతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. మొత్తానికి కరోనాతో మన అంతరిక్ష ప్రయోగాలకు ఎప్పుడూ ఎన్నడూ ఎరుగానిరీతిలో ఎఫెక్ట్ కలిగింది.

Full View




Tags:    

Similar News