Corona: ట్రిపుల్‌ మ్యూటేషన్‌ వేరియంట్‌గా కరోనా రూపాంతరం

Corona: కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరంగా ఉండటానికి.. కొత్త రకం ట్రిపుల్‌ మ్యూటేషన్లే కారణం-సైంటిస్టులు

Update: 2021-04-22 02:05 GMT

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Corona: దేశంలో మహమ్మారి విజృంభించిన తర్వాత మరో కొత్త మ్యూటేషన్‌ వచ్చి నయా ఛాలెంజ్‌ విసురుతోంది. అవును కొత్తగా పుట్టుకొచ్చిన ట్రిపుల్‌ మ్యూటేషన్‌ భారత్‌ పాలిట సవాలుగా మారింది. ఇక ఈ ట్రిపుల్‌ మ్యూటేషన్‌ వలనే భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరంగా ఉండటానికి కొత్త రకం ట్రిపుల్‌ మ్యూటేషన్లే కారణమని సైంటిస్టులు భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ తన రూపాన్ని మార్చుకునే కోవిడ్ కొద్ది కాలం కిందటే డబుల్‌ మ్యూటేషన్లుగా ఏర్పడి తీవ్ర ప్రభావం చూపేదిగా మారిందన్నారు. అయితే ఇప్పుడది ఇంకా బలపడుతూ ట్రిపుల్‌ మ్యూటేషన్‌ వేరియంట్‌ గానూ రూపాంతరం చెందిందని చెబుతున్నారు. చెప్పాలంటే దేశంలో ట్రిపుల్‌ మ్యూటేషన్ల కారణంగానే కొత్త కేసులు, మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయంటున్నారు.

ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో నమోదైన కొత్త కేసుల్లో ట్రిపుల్‌ మ్యూటేంట్‌ కనిపించిందన్నారు ప్రొఫెసర్‌ మధుకర్‌. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్‌పై మరింత లోతుగా అధ్యయనం చేస్తూ వ్యాక్సిన్లను ఇంకాస్త అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రిపుల్‌ మ్యూటేంట్‌తో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ఆయన అది వెంటనే అనారోగ్యానికి గురయ్యేలా చేస్తోందన్నారు. ఇక ట్రిపుల్‌ మ్యూటేంట్‌ ఎఫెక్ట్‌ చిన్న పిల్లలపై ఎక్కువగా ఉంటుందంటున్నారు.

చెప్పాలంటే.. దేశంలో కరోనా మొదటి వేవ్‌లో పది మందిలో ఒకరు లేదా ఇద్దరికి వైరస్‌ వ్యాప్తి చెందగా.. ప్రస్తుత డబుల్‌ మ్యూటేషన్‌తో వైరస్‌ వ్యాప్తి ఎనిమిదికి చేరింది. అయితే.. ఇప్పుడు ట్రిపుల్‌ మ్యూటేషన్‌ అంతకుమించి వేగంగా వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇక ట్రిపుల్‌ మ్యూటేషన్స్‌ ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పెంచుతున్నాయంటున్నారు. మరోవైపు వైరస్‌ జెనోమ్‌ను స్టడీ చేయడానికి పది ల్యాబ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News