Corona New Variant: భారత్-సింగపూర్ మధ్య కరోనా న్యూ వేరియంట్ వివాదం
Corona New Variant Dispute: భారత్, సింగపూర్ దేశాల మధ్య కొత్త కరోనా వివాదం
Corona New Variant Dispute: టీ కప్పులో తుపాన్ తెలుసు.. కాని ట్విట్టర్ కప్పులో తుపాన్ తెలుసా? అవును ఇప్పుడు అదే జరిగింది. ట్విట్టర్ లో ఓ సీఎం పెట్టిన ట్వీట్.. తుపానులా మారి సింగపూర్ తీరాన్ని తాకితే.. వెంటనే అప్రమత్తమైన భారత ప్రభుత్వం ఆ తుపాన్ ను చల్లార్చేసింది. భారత్ సింగపూర్ మధ్య కొత్త వివాదం అలా మొదలై ఇలా ముగిసింది. సింగపూర్ లో ఇప్పుడు కొత్త వేరియెంట్ విజృంభిస్తోంది. కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి ఢిల్లీని కరోనా బారి నుంచి కాపాడే బాధ్యతను తలకెత్తుకున్న కేజ్రీవాల్ సింగపూర్ పరిణామాలను అబ్జర్వ్ చేశారు. అందుకే వెంటనే సింగపూర్ కు రాకపోకలు నిలిపివేయాలంటూ కేంద్రాన్ని అభ్యర్ధిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది.
అసలు ఇప్పుడు సింగపూర్ లో వచ్చిన వేరియెంట్.. ఇండియా నుంచే వచ్చిందని.. తాము భారతదేశానికి అందిస్తున్న సాయాన్ని సైతం మర్చిపోయా ఇలా మాట్లాడటం సరి కాదంటూ సింగపూర్ మంత్రి తీవ్రంగా విమర్శించారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి మాత్రమేనని.. కేంద్రానికి ప్రతినిధి కాదని.. అది ఇండియా అభిప్రాయం కానే కాదని.. తేల్చి చెప్పింది.
భారత్ కు సింగపూర్ ఆక్సిజన్ సేవలను అందిస్తోంది.. వారి మిలటరీ విమానాలను ఉపయోగిస్తుందని.. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం అలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలియచేసింది.కేజ్రీవాల్ మాత్రం మళ్లీ ఈ విషయంపై నోరు మెదపలేదు. అటు-థర్డ్ కోవిడ్ వేవ్ కి సిద్ధపడి ఉండాలని కేంద్రానికి ముఖ్య శాస్త్రీయ సలహాదారైన కె.విజయరాఘవన్ హెచ్చరించారు. ఇప్పటికే మూడో కోవిద్ వేవ్ పై కేంద్రం కూడా వివిధ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.