Corona JN1: దేశంలో పది రాష్ట్రాలకు విస్తరించిన కరోనా జేఎన్ 1
Corona JN1: ఇప్పటివరకు 196 జేఎన్.1 వేరియంట్ కేసులు
Corona JN1: కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1 దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో ఇప్పటి వరకు 196 జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదైనట్లు ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్టియం పేర్కొంది. ఇప్పటివరకు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించిందని పేర్కొంది. తాజాగా ఒడిశాలో కొత్త కేసు నమోదైంది. జేఎన్.1 వేరియంట్ వేగంగా విస్తరిస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
సాధారణ కరోనా కేసులు కూడా భారత్‌లో క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 636 కొత్త కేసులు రికార్డయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల 394కి చేరింది. వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.