Coronavirus: వరుసగా మూడోరోజు 2 లక్షలు దాటిన కరోనా కేసులు

Coronavirus: వరుసగా మూడోరోజు 2 లక్షలు దాటిన కరోనా కేసులు * కొత్తగా 2,34,692 కేసులు

Update: 2021-04-17 05:04 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: భారత్‌లో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది. వరుసగా మూడోరోజు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రెండు లక్షల 34 వేల 682 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య ఒకేరోజులో దాదాపు రెండు వందలు జంప్ అయింది. శుక్రవారం వరకు 11వందల 80 మంది చనిపోగా శనివారం 13 వందల 41 మంది మృత్యువాత పడ్డారు.

తాజా కేసులతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి 45 లక్షల 26 వేలు దాటింది. ప్రస్తుతం దేశంలో 16 లక్షల 79 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. రోజురోజుకూ యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో రికవరీ రేటు తగ్గిపోతుంది. 90 శాతానికి పైగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 87.౮ శాతానికి చేరింది. మరణాల రేటు 1.22 శాతానికి చేరింది.

Full View


Tags:    

Similar News