Corona Cases in India: దేశవ్యాప్తంగా పెరిగిన కేసులు, మరణాల సంఖ్య
Corona Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని ఊరట చెందుతున్న సమయంలో.. ఒమిక్రాన్ ఆందోళన మొదలైంది.
Corona Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని ఊరట చెందుతున్న సమయంలో.. ఒమిక్రాన్ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో రోజురోజుకి కొత్త కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మిజోరాం, జమ్మూ-కశ్మీర్‌లకు లేఖ రాసింది.
హాట్‌స్పాట్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. దీంతోపాటు విదేశీ రాకపోకలు, ముఖ్యంగా 'రిస్క్' దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై దృష్టి పెట్టాలని, పాజిటివ్ వచ్చినవారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపాలని తెలిపింది.