కర్ణాటక శాసనసభలో గందరగోళం.. సభాపతిపై కాగితాలు చింపి విసిరిన బీజేపీ ఎమ్మెల్యేలు
Karnataka: 10 మంది ఎమ్మెల్యేలను ప్రస్తుత సెషన్‌కు సస్పెండ్ చేసిన సభాపతి
Karnataka: కర్ణాటక శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నిన్నటి విపక్షాల సభకు ఐఏఎస్‌లను వినియోగించారని బీజేపీ సభ్యులు ఆరోపించారు. ఐఏఎస్ వ్యవస్థను దుర్వినియోగం చేశారంటూ నిరసనకు దిగడంతో పాటు సభాపతిపై కాగితాలు చింపి విసిరారు. దీంతో ఒక్కసారిగా సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష సభ్యుల తీరును తీవ్రంగా పరిగణించిన సభాపతి..10 బీజేపీ ఎమ్మెల్యేలను ప్రస్తుత సెషన్ వరకు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో సునీల్ కుమార్, ఆర్ అశోక్, సీఎన్ అశ్వథ్ నారాయణ్, యశ్‌పాల్ ఆనంద్ సువర్ణ, డీ వేదవ్యాస్ కామత్, అర్వింద్ బెల్లాడ్, అరగ జ్ఞానేంద్ర, ఉమానాథ కొటైన్, ధీరజ్ మునిరాజు, భరత్ శెట్టి ఉన్నారు.