10th Exams: పదో తరగతి విద్యార్థులందరూ పాస్.. అసలు మార్కులు ఎలా వేస్తారు..?
దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. చాలా రాష్ట్రాలు సొంతంగా లాక్‌డౌన్ కూడా విధించుకున్నాయి.
10th Exams: దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. చాలా రాష్ట్రాలు సొంతంగా లాక్‌డౌన్ కూడా విధించుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్ అయినట్టు ప్రకటించారు. తెలంగాణలో కూడ అలాగే పాస్ చేశారు. అయితే గతేడాది లాగా కాకుండా ఈ సారి.. పదో తరగతి విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని విద్యాశాఖ చూస్తోంది. అసలు మార్కులు ఎలా వేస్తారు..?
దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అయితే రద్దు అయిన సీబీఎస్ఈ పదో తరగతి పరీక్ష ఫలితాలను ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ప్రకటించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నల్ మార్కులకి మరో 20 మార్కులు వేసి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై అన్ని రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. కరోనా కారణంగా విద్యార్థులు నష్టపోకుండా మార్కులు వేయాలని చూస్తున్నారు. ఇప్పటికే గతేడాది లాక్‌డౌన్ కారణంగా విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో కూడా రద్దైన పదో తరగతి ఫలితాలను ఇదే ప్రాతిపదికగా ప్రకటించే అవకాశం ఉంది. ఫార్మటివ్ అస్సెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్స్ ఇవ్వనుంది ప్రభుత్వం. విద్యార్థులకు తరగతులు జరిగే సమయంలోనే ఈ మార్కులను కేటాయించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం ఫార్మటివ్ అస్సెస్మెంట్ మార్కుల ప్రకారం డేటా సిద్ధం చేసింది. ఇక 5లక్షల 21వేల 393 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరూ పాస్ అయినట్టే నని అధికారులు చెబుతున్నారు.