CISF Recruitment 2022: సీఐఎస్‌ఎఫ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. వారు మాత్రమే అర్హులు..!

CISF Recruitment 2022: భారత సైనిక దళాలలో పనిచేయాలనే లక్ష్యం ఉన్న క్రీడాకారులకి ఇది శుభవార్తే అని చెప్పాలి.

Update: 2022-03-21 15:00 GMT

CISF Recruitment 2022: సీఐఎస్‌ఎఫ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. వారు మాత్రమే అర్హులు..!

CISF Recruitment 2022: భారత సైనిక దళాలలో పనిచేయాలనే లక్ష్యం ఉన్న క్రీడాకారులకి ఇది శుభవార్తే అని చెప్పాలి. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(CISF) డైరెక్టరేట్‌ జనరల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 249 ఖాళీలను భర్తీ చేయనుంది. స్పోర్ట్స్‌ కోటా ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఖాళీలకు స్త్రీ, పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఏయే క్రీడాంశాల్లో ఖాళీలు ఉన్నాయి.? దరఖాస్తు విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 249 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో పురుషులకు 181, మహిళలకు 68 పోస్టులు ఉన్నాయి. అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌ బాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్‌ స్పోర్ట్స్‌ కోటాలో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణతతో పాటు, రాష్ట్ర/జాతీయ/అంతర్జాతీయ స్థాయి గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్‌లో పాల్గొని ఉండాలి. అంతేకాకుండా నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

అభ్యర్థుల వయసు 01-08-2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులని ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), డాక్యుమెంటేషన్, ట్రయల్‌ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 31-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకి అధికారిక నోటిఫికేషన్ చదవండి.

Tags:    

Similar News