Indo - China Border: మరోసారి రెచ్చిపోయిన కంత్రీ డ్రాగన్

*సరిహద్దు ప్రాంతంలో గ్రామం నిర్మాణం *4.5 కి.మీ మేర చొచ్చుకొచ్చిన చైనా *101 ఇళ్లతో గ్రామం నిర్మాణం చేసిన డ్రాగన్

Update: 2021-11-05 10:35 GMT

మరోసారి రెచ్చిపోయిన కంత్రీ డ్రాగన్

Indo - China Border: సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న వేళ కంత్రీ డ్రాగన్ మరోసారి తన చర్యలతో భారత్‌ను రెచ్చగొడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంట భారత భూభాగంలో ఏకంగా ఓ చిన్నపాటి విలేజ్‌నే నిర్మించేసింది. మన భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చినట్లు శాటిలైట్ ఇమేజ్‌లు స్పష్టం చేస్తున్నాయి. డ్రాగన్ సృష్టించిన గ్రామంలో 101 ఇళ్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇదే తరహాలో మరికొంత దూరంలో మరో గ్రామాన్ని నిర్మించింది. అయితే, ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం భౌగిళికంగా భారత భూభాగంలో ఉన్నప్పటికీ 1959 నుంచి చైనా ఆధీనంలో ఉంది. గతంలో అక్కడ చైనా ఆర్మీ మాత్రమే ఉండగా తాజాగా గ్రామన్ని ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.

Tags:    

Similar News