దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ? మే 2 తరువాతే ఏ నిర్ణయమైనా..!

National Lockdown: దేశం ప్రస్తుతం కరోనా సుడిగుండంలో చిక్కుకుంది. రోజురోజుకూ రికార్డుల మేర కేసులు నమోదవుతున్నాయి.

Update: 2021-04-27 10:41 GMT

మరో లాక్‌డౌన్ తప్పదా (ఫొటో ట్విట్టర్)

National Lockdown: మనదేశం ప్రస్తుతం కరోనా సుడిగుండంలో చిక్కుకుంది. రోజురోజుకూ రికార్డుల మేర కేసులు నమోదవుతున్నాయి. 3 లక్షల కేసులు వెలుగు చూస్తున్నాయంటే... పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మే నెలలో కరోనా తీవ్ర స్థాయిలోకి చేరుకుంటుందని చెప్పడంతో.. వచ్చే నెలను తలచుకుంటేనే భయంగా మారబోతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడకి దేశ వ్యాప్తంగా నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదంతా మే 2 తరువాత జరగనుందని తెలుస్తోంది.

కారంణం, పశ్చిమ బెంగాల్‌లో మరో విడత పోలింగ్ మిగిలి ఉంది. అలాగే మే 2న రిజల్ట్స్ ప్రకటించనున్నారు. ఈ తతంగం ముగిసిన తర్వాతే హెల్త్ ఎమర్జెన్సీపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

అలాగే సోషల్ మీడియాలో కొన్ని పుకార్లను కూడా షేర్ చేస్తుండడంతో.. కేంద్ర సీరియస్ గా ఉందంట. ఆక్సీజన్ అందుబాటులో లేదని, ఔషధాల పంపిణీలోనూ కొన్ని వదంతలు వ్యాప్తిచేస్తున్నారు. ఇలాంటి వాటిపైనా కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏదైనా మరో వారంలో దేశంలో ఏం జరుగుతుందో తెలయని పరిస్థితి నెలకొంది.

Tags:    

Similar News