నేడు విచారణకు హాజరవ్వాలంటూ సిసోడియాకు తాఖీదు
Manish Sisodia: మద్యం విధానం రూపకల్పన అవినీతిలో సిసోడియాపై కేసు
Manish Sisodia: సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు సీఐబీ హెడ్‌క్వార్టర్స్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మద్యం విధానం రూపకల్పనలో అవినీతి జరిగిందంటూ సిసోడియాతోపాటు మరో 14 మందిపై సీబీఐ గత ఆగస్టులో కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. సీబీఐ తన ఇంట్లో 14 గంటలపాటు తనిఖీలు నిర్వహించిందని, వారికి ఏమీ దొరకలేదని, తన బ్యాంక్ లాకర్‌లోనూ అధికారులు వెతికారని, అయినా వారికి ఏమీ లభించలేదన్నారు మనీష్ సిసోడియా.... తనకు సమన్లు జారీ చేశారని, విచారణకు హాజరై పూర్తిగా సహకరిస్తానని ట్వీట్ చేశారాయన.... కాగా.. ఆయన ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిసోడియా సన్నిహితులకు మద్యం వ్యాపారి అయిన మహేంద్రు నుంచి కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని సీబీఐ ఆరోపించింది. తెలంగాణకు చెందిన ఓ మద్యం వ్యాపారి లాబీకి కూడా ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ అక్రమాల్లో ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది. అరెస్టయిన బోయినపల్లి అభిషేక్... సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా పేర్కొన్న అరుణ్ పిళ్లయ్‌కి వ్యాపార భాగస్వామి.... తాజాగా సిసోడియాకు సమన్లు ఇవ్వడంతో ఈ వ్యవహారం కీలకమలుపు తిరిగినట్టయింది.