Bharat Bandh: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్.. సుప్రీం తీర్పు ఉపసంహరించుకోవాలని డిమాండ్

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం ఇచ్చిన తీర్పును వెంటనేవెనక్కు తీసుకోవాలని మాల సామాజిక వర్గాల నేతలతో పాటు రిజర్వేషన్ బచావో సంఘం డిమాండ్ చేస్తోంది.

Update: 2024-08-21 05:55 GMT

Bharat Bandh: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్.. సుప్రీం తీర్పు ఉపసంహరించుకోవాలని డిమాండ్

Bharat Bandh: ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీర్పులపై ఎస్సీ సామాజిక వర్గం నిరసన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ, ఎస్టీల్లో విభజన ఏర్పడుతుందనే ఆందోళణ వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ బచావో సంఘం సమితి నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం ఇచ్చిన తీర్పును వెంటనేవెనక్కు తీసుకోవాలని మాల సామాజిక వర్గాల నేతలతో పాటు రిజర్వేషన్ బచావో సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సుప్రీం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణ బంద్ పాటించాలంటూ కోర్టు తీర్పును వ్యతిరేకించాలంటూ కోరారు. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

కాగా నేటి భారత్ బంద్ లో భాగంగా ఎమర్జెన్సీ సర్వీసులు, అంబులెన్స్ సేవలు, వైద్య సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు బంద్ నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ ఆఫీసులు, బ్యాంకులు, స్కూల్స్, కాలేజీలు యదావిధంగా కొనసాగుతాయని సర్కార్ తెలిపింది. భారత్ బంద్ పిలుపుతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.

Tags:    

Similar News