B.1.618 variant: భారత్‌లో మరో ప్రమాదకర కరోనా మ్యూటెంట్‌ గుర్తింపు

B.1.618 variant: ఓ వైపు భారత్‌ను కరోనా మహమ్మారి పట్టి పీడుస్తోంది.

Update: 2021-05-21 07:08 GMT

కరోనా(Representational ఇమేజ్)


B.1.618 variant: ఓ వైపు భారత్‌ను కరోనా మహమ్మారి పట్టి పీడుస్తోంది. ఇది చాలదన్నట్టు కరోనా మ్యూటెంట్లు వరుస దాడి చేస్తున్నాయి. దేశంలో మరో ప్రమాదకర కరోనా మ్యూటెంట్‌ను గుర్తించారు నిపుణులు. బెంగాల్‌లో B.1.618 రకం కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే బెంగాల్‌లో B.1.617 రకం కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పుడు దానికి ఈ కొత్త రకం తోడైంది.

ప్రపంచంలో మరికొన్ని దేశాల్లో ఈ తరహా డబుల్ మ్యూటెంట్ల వ్యాప్తి ఉందని చెబుతున్న నిపుణులు భారత్‌లో గుర్తించిన B.1.618 రకం అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. B.1.618 కొత్త రకానికి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యం అధికమని వారు అంటున్నారు.

Tags:    

Similar News